కుంకలగుంట గ్రామంలో ఇంటింటికి పవనన్న ప్రజాబాట

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్ ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఇంటింటికి పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కుంకలగుంట గ్రామంలోని రంగ బొమ్మ సెంటర్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా మండల అధ్యక్షురాలితోపాటు కుంకలగుంట గ్రామ జనసైనికులు, గ్రామ నాయకులు నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావుకు ఘన స్వాగతం పలకడం జరిగినది. అనంతరం నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట్ అప్పారావు మాట్లాడుతూ పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కుంకలగుంట గ్రామ అలాగే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన జనసైనికులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ పవనన్న ప్రజా బాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు తెలియజేస్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమంలో కుంకలగుంట గ్రామంలో ప్రజలు గ్రామంలోని మంచినీటి, డ్రైనేజీ, వీధిలైట్లు, రైతులకు సాగునీరు సమస్యలను తెలపడం జరిగినది. నియోజకవర్గంలో గత రెండు వారాల నుండి కరెంటు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని గ్రామంలో చిన్న వర్షానికి డ్రైనేజీలు నిండిపోయి రోడ్డు మీదకు వస్తున్నాయని ఈ వర్షాకాలంలో ఆ డ్రైనేజీల వలన తీవ్ర దుర్వాసన అలాగే దోమలు విపరీతంగా వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం కొనసాగుతుందని రానున్నది పవనన్న ప్రజా ప్రభుత్వమని తెలిపారు. 2024లో ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు మీద గుద్ది పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, వార్డు కౌన్సిలర్ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు, జనసైనికులు మరియు వీరమహిళలు భారీగా తరలి రావడం జరిగినది.