పెయింటర్ సుల్తాన్ కి అండగా నిలబడిన తాడిపత్రి జనసేన

తాడిపత్రి, తాడిపత్రి పట్టణంలోని సుల్తాన్ అనే పెయింటర్ కార్మికుడు నెల రోజుల క్రితం పెయింటింగ్ పనిచేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి తన రెండు కాళ్ళు మరియు వెన్నెముక విరగడం జరిగింది. తాడిపత్రి జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ విషయాన్ని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు, జనసేన పార్టీ నాయకులకు తెలియజేయగా… జనసేన పార్టీ నాయకులు స్పందించి సుల్తాన్ ఇంటి దగ్గరకు వెళ్లి పరామర్శించి 75 కేజీల బియ్యాన్ని మరియు నిత్యవసర సరుకులను మూడు నెలలకు సరిపడా అందించడం జరిగింది. తర్వాత కూడా ఏదైనా అవసరానికి తగ్గట్టు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుందుర్తి నరసింహాచారి, అఖిలభారత చిరంజీవి యువత తాడిపత్రి అధ్యక్షులు ఆటో ప్రసాద్, ఉపాధ్యక్షుడు కుమ్మెత ప్రతాప్ రెడ్డి, సీనియర్ అభిమాని మేదర మురళి మరియు జనసేన పార్టీ జిల్లా కార్యక్రమం సంఘం సభ్యులు మాది నేని గోపాల్ అచ్చుకట్ల అల్తాఫ్, జనసైనికులు కె.నరేష్ రెడ్డి (సాఫ్ట్ వేర్50 క్గ్ రైస్), యు.గోవర్ధన్, రబ్బానీ, షేక్ సాదక్ వలి, బుక్కపట్నం ఇమాంవలి తదితరులు పాల్గొనడం జరిగింది.