క్రియాశీలక సభ్యత్వ నమోదును సద్వినియోగం చేసుకొండి.. భైరవ ప్రసాద్

జనసేన పార్టీ మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి అని కదిరి నియోజక వర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భైరవ ప్రసాద్ మాట్లాడుతూ.. కదిరి నియోజక వర్గంలో గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతంకోసం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్త తప్పకుండా జనసేన పార్టీ మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మీ సభ్యత్వం నమోదు చేసుకోండి. పార్టీ బలోపేతం కోసం కష్టపడే కార్యకర్తలకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి కొండంత అండగా ఉండాలని 500000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. దేశంలో ఉన్న ప్రతి పార్టీలు కార్యకర్తలని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోంగిచుకొని కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది కలిగితే పట్టి పట్టనట్లు ఉన్న తరుణంలో, ఒకే ఒక పార్టీ కార్యకర్తలే తమకు బలం అని నమ్మి వారికి పార్టీ భరోసాగా ఉండటం కోసమే అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం మొదలు పెట్టారు. కావున నియోజకవర్గంలో మండల స్థాయిలో, గ్రామస్థాయిలో, పట్టణ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోండి అని భైరవ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, హరి బాబు, గణేష్, నరసింహులు, అంజి పాల్గొన్నారు.