సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం వెంటనే చేపట్టండి.. లేని యెడల ప్రజల పక్షాన ఉద్యమం ఉధృతం చేస్తాం

తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణంలో నిత్యం అత్యధిక జన సామర్ధ్యము గల ప్రధాన కూడలి యందు ఉప్పాడ బస్టాండ్ పార్క్ సెంటర్ నందు ఉప్పాడ వెళ్ళు దారిలో ఆటో స్టాండ్ దగ్గర సులబ్ కాంప్లెక్స్ ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం చిన్నమాంబ పార్కు ను అభివృద్ధి చేస్తున్నాం అనే పేరుతో ఇక్కడి సులబ్ కాంప్లెక్స్ ను తొలిగించారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ.. ప్రభుత్వాలు మారినా సులబ్ కాంప్లెక్స్ ను పునఃనిర్మించుటకు ప్రజాప్రతినిధులు ముందుకు రావడంలేదు. నిత్యం సుమారు కొన్ని వేల సంఖ్యలో ప్రయాణికులు తమ అవసరాల రీత్యా ప్రయాణం చేస్తుంటారు. సామాన్యులు మరియు అందులో మరీ ముఖ్యంగా మహిళామూర్తులు ప్రయాణించే సమయంలో సులబ్ కాంప్లెక్స్ లేకపోవడంతో ఇబ్బందులకు గురౌతున్నారు. గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు కలిగిన మాతృమూత్రులు, ఎమర్జెన్సీ అయితే ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. వికలాంగులు అయితే వారి పరిస్థితి మరింత దయనీయం. ఒకవేళ కాలకృత్యాలకి వెళ్లాలన్నా పిఠాపురం మొత్తంమీద మార్కెట్ లో అంటే సుమారు కిలోమీటర్ దూరంలో ఒకే ఒక్క పబ్లిక్ టాయిలెట్ మాత్రమే ఉంది. ఇంతటి ఇబ్బందికరమైన విషయం గురించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లు వివరించినా.. నిమ్మకునీరెత్తినట్లు ఉంటూ కాలయాపన చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన కనీస ఆవశ్యకతను గుర్తించలేకపోతున్నారు. ప్రజాప్రతినిధులు మహిళలకు మేము ఇన్ని సీట్లు ఇచ్చాం, ఇన్ని చేశాం.. అన్ని చేశాం అని చెప్పుకునే వారు మహిళలు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని ఎన్ని సార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదంటే ప్రజాప్రతినిధులుగా ఉండి మనం ఏమి చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అని జనసేనపార్టీ కందరాడ ఎంపీటీసీ శ్రీమతి పిల్లా సునీత పేర్కొన్నారు. సులబ్ కాంప్లెక్స్ వెంటనే నిర్మించాలని అఖిలపక్షం తరుపున దీక్ష చేపట్టిన పిదప వారం రోజులు గడువు అడిగినా, అధికారులు 10 రోజులు కావస్తున్నా.. ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టని యెడల శుక్రవారం మహిళలతో గౌరవ మునిసిపల్ కమీషనర్ కు వినతి పత్రం అందజేసీ.. దీనికి వెంటనే పరిష్కారం చూపమని కొరడమైనది. లేనియెడల దీనిని ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన నిలబడి ముందుకు తీసుకువెళ్లే దిశలో మరింత ఉద్రిక్తత చేయవల్సివస్తుంది అని అఖిలపక్షం తరుపున జనసేన పార్టీ వీరమహిళ పిల్లా రమ్యజ్యోతి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండలం, కందరాడ జనసేన ఎంపీటీసీ శ్రీమతి పిల్లా సునీత, బీజేపీ జిల్లా మహిళా మోర్చా సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీమతి యస్ జ్యోతి, నియోజకవర్గ మరియు నిత్యం ప్రయాణించే మహిళలు లలిత, సుశీల తదితరులు పాల్గొన్నారు.