మహిళలతో-మాటామంతి

  • స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 2వ డివిజన్లో కొనసాగిన మహిళలతో మాటామంతి కార్యక్రమం.
  • మహిళా ద్రోహి జగన్ మోహన్ రెడ్డి

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 2వ డివిజన్ బిందెల కాలనీ నందు మహిళలతో మాటామంతి అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలో మహిళలను అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని మహిళలకోసం ప్రత్యేకంగా 2019 మేనిఫెస్టోలో వైకాపా చేర్చిన అంశాలు అమలుకు నోచుకోలేదని ఇక్కడ స్థానికంగా చూసినట్లయితే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం అమలు కాలేదని అమ్మవడి పరిస్తితి దాదాపు ఈవిధంగానే ఉందని ఇక్కడ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవస్తంగ ఉందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి 800 కోట్లతో చేసిన అభివృద్ధి ఇదేనా అని ప్రశ్నిస్తూ జనసేన టీడీపీ అధికారం లోకి వస్తే మహిళల కోసం ప్రత్యేకంగా మహాశక్తి పేరుతో తల్లికి వందనం క్రింద ఇంట్లో ఎంత మంది చదువుకునే అంతమందికి ఒక్కొక్కరికి 15వేళ రూపాయలు ఆడబిడ్డ నిధికింద 18సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 15వందలు దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం వంటి ఎన్నో మహిళా ఉపయోగ పథకాలు అమలు చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించి మన రాష్ట్రాన్ని అప్పులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని అందువలన ప్రతి ఒక్కరూ జనసేన-టిడిపికి ఓటు వేసి ప్రభుత్వ స్థాపనకు దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు వీర మహిళలు జనసేన-టీడీపీ నాయకులు మారన్న వాన్నురప్ప అంజి తదితరులు పాల్గొనడం జరిగింది.