కొల్లేరు అక్రమ తవ్వకాలని అడ్డుకున్న తాతపూడి చందు

దెందులూరు నియోజకవర్గం, పైడి చింతపాడు గ్రామంలో అభయారణ్యం చట్టంలో ఐక్యరాజ్య సమితి రాంసార్ సైట్ లో గుర్తించబడిన కొల్లేరులో అక్రమ తవ్వకాలు 102 ఎకరాలు జరుగుతున్నాయి అని పక్కా ఆధారాలతో దానిని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తొలగించడానికి అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లగా అక్రమ చెరువులు తవ్వడమే కాకుండా వారిని, వారి వాహనాలను అడ్డుకొని అధికారులని ఇబ్బందికి గురిచేసి వారి వాహనాల మీద కూర్చొని దర్జాగా వాటర్ తాగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాస్తున్నామని జనసేన నాయుకులు చందు తాతపూడి తెలిపారు.