పొత్తు ధర్మాన్ని పాటించి టిడిపి అభ్యర్థిని గెలిపించాలి!

  • జనసేన ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ వెంకప్ప

ఆలూరు: దేవనకొండ మండల పరిధిలో ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం కార్యకర్తలతో కలిసి శ్రీ లక్ష్మీరంగ కళ్యాణమండపం నందు టిడిపి, జనసేన, బిజెపి, మండల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్, జనసేన ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ వెంకప్ప, బిజెపి జిల్లా నాయకుడు వెంకటరాముడు, జనసేన కర్నూలు ఇంచార్జ్ చింత సురేష్ బాబు మాట్లాడుతూ భవిష్యత్తు కోసం ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు. కార్యకర్తలు అంతా వీరభద్ర గౌడ్ ను మన అభ్యర్థిగా భావించి ముందుకు సాగాలని అన్నారు. రాష్ట్రంలో చేతగాని సీఎం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి కష్టాలను తొలగించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. వీరభద్ర గౌడ్ గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు సైనికుడి మాదిరిగా పని చేయాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో ప్రతిఒక్కరు కష్టపడి మండలంలో టిడిపి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని. జగన్‌ను ఓడించాలంటే ప్రతీ ఒక్కరు ఓటు హక్కు సద్విని యోగం చేసుకుని టీడీపీ కూటమికి ఓటు వెయ్యాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త అందరిని కలుపుకొని గ్రామంలో వర్గవిభేదాలు లేకుండా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి, లోక్ సత్తా, ఎమ్మార్పీఎస్ నాయకులు బడిగింజలరంగన్న, మలకన్న, చారురామాంజనేయులు, రామారావు, మల్లయ్య, రామచంద్ర నాయుడు, బొజ్జమ్మ, సరోజ, జగదీష్, ఆంటోనీ, రామ లక్ష్మణ్, కప్పట్రాళ్ల మల్లికార్జున, బోడ రవి, సర్పంచ్ భర్త బండ్లయ్య, డీలర్ బండ్లయ్య, మస్తాన్, కుక్కల తిమ్మయ్య, డిష్ సుభాన్, శేఖర్, రాందాస్ గౌడ్, పొట్లపాడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.