బొర్రా ఆధ్వర్యంలో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశం

  • ఆంధ్రరాష్ట్రంలోనే మొదటి మిత్ర పక్షల ఆత్మీయ కలయిక
  • ఇరుపార్టీల ముఖ్య నాయకుల పరిచయవేదిక

సత్తెనపల్లి నియోజకవర్గం: జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో సోమవారం టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ జనసేన పార్టీ పెట్టిన కేవలం నెలరోజులకే.. ఎటువంటి మంత్రి పదవులు ఏమి ఆశించకుండా టిడిపికి సంఘీభావం తెలిపిన పార్టీ జనసేన పార్టీ. అనుభవం ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయడం వల్ల ఈ రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో మద్దతు తెలియజేశారు. గతంలో టిడిపి ఒక్క మండలంలో మేమే గెలిచాము. తెలుగుదేశంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ దగ్గరనుంచి నాకు పిలుపు వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఉద్దేశంతోనే, భవిష్యత్తు బాగుండాలి అనుకునేవారు. సైకో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే అడ్డుకున్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చారు ఎటువంటి నోటీసు ఎలాంటి సమాచారం లేకుండా అక్రమంగా రాయలసీమలో అరెస్ట్ చేశారు. లండన్ లో కూర్చుని పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్లు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అపరిచితు వస్తే సామాన్లు పరిస్థితి ఏమిటి. చంద్రబాబుని రాజమండ్రిలో చూసి చెల్లించిపోయి మద్దతు ఇచ్చారు. తెలంగాణకు ఇంత ఆదాయం వస్తుంది అంటే ముందు చూపే కారణం. అనుభవం ఉన్న పార్టీకి మద్దతిస్తానని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలి. జనసేన పవన్ కళ్యాణ్ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి పోవాలి. జనసేన లక్ష్యం అంబటి రాంబాబును రేపల్లె పంపించాలి. పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే పని చేస్తాను. ఈ రాష్ట్రం బాగుపడాలంటే జనసేన టిడిపి కలిసి పోరాడాలి అమరావతి రాజధాని అయితే మన పిల్లలకు మనకు చాలా అవకాశాలు వస్తాయి. నేను తెలంగాణలో బతుకుతూ ఉన్నాను. ఎంతమంది ఉపాధి ఇచ్చిన ఏమి చేసినా మీరు తెలంగాణలో బతకడానికి వచ్చినారు అంటారు. మన హక్కులను మనం కాపాడుకోవాలి కానీ మన వాటాలు మనం అడగలేకపోతున్నాం. మనకే మనం ఉద్యోగాలు సృష్టించుకోలేమా మనకే మన పరిశ్రమల స్థాపించుకోలేమా. ప్రణాళిక లక్ష్యం లేకుండా కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు సముద్రపాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చుక్క చుక్కను వడిసి పట్టి ప్రజలకు అందిస్తున్నారు. 30, 40 సంవత్సరాలు వెనక్కి పోయాము. ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోకపోతే మనగతి అదో గతే అని అన్నారు. పాల్గొన్న మాజీ మంత్రి, టిడిపి మాజీ ఇంఛార్జి కన్నా లక్ష్మీనారాయణ, అబ్బూరి మల్లి, చౌట శ్రీనివాసరావు, నాగోతు సౌరయ్య, టీడీపి రూరల్ మండల అధ్యక్షులు అమరేశ్వరరావు, వందనదేవి, వక్కంటి అజయ్ కుమార్, మొక్కపాటి రామచంద్రరావు, గన్నమనేని శ్రీనివాసరావు, పూజల వెంకటకోటయ్య, బత్తుల ఆదినారాయణ, పచ్చల నాగేశ్వరరావు, ఎల్.రవి, జనసేన కొమ్మిశెట్టీ సాంబశివరావు, మండల అధ్యక్షులు సత్తెనపల్లి నాదెండ్ల నాగేశ్వరరావు, రాజుపాలెం తోట నరసయ్య, ముప్పాళ్ళ సిరిగిరి పవన్ కుమర్, నకరికల్లు తాడువాయి లక్ష్మి, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి అంపిర్యాని రాజేశ్వరి, రంగిసెట్టీ సుమన్ కుమార్, బత్తుల కేశవ, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.