కొండపి నియోజకవర్గంలో టిడిపి గెలుపు జనసేన-బిజేపి లక్ష్యం

కొండపి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేసింది ఈ వైసిపి ప్రభుత్వం, జనసేన బిజేపి రెండు పార్టీలు పొత్తు ధర్మం పాటిస్తూ టిడిపి గెలుపు కోసం కృషి చేస్తాము. వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, ప్రజలకు తాగునీరు సాగునీరు కోసం వైసిపి ప్రభుత్వం ఏమీ చేసింది ? సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాము అని వైసిపి నాయకులు మాయమాటలు చెప్పారు, గ్రామాల్లో కొత్తగా సిసి రోడ్లు వేయలేదు, డ్రైనేజీలు నిర్మించలేదు, ముఖ్యంగా రైతులకి తీరని అన్యాయం జరిగింది. అన్ని కులాల కార్పొరేషన్లు ద్వారా ఎవ్వరికీ కూడా ఎటువంటి లోన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. టిడిపి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిలో కనీసం 10 శాతం కూడా ఈ వైసిపి ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి చేయలేకపోయింది, జనసేన టిడిపి బిజేపి మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని కొండపి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేలాగా చూస్తాము అని కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐయినాబత్తిన రాజేష్, గూడా శశిభూషణ్, సయ్యద్ ఖాజా హుస్సేన్, కాసుల శ్రీనివాస్, నాగరాజు, కర్ణ తిరుమలరెడ్డి, అత్యల సురేష్ బాబు, వరికూటి చిరంజీవి, చనగర రాజేష్, కిరణ్, నరసింహ, ఆనంద్, కుంచాల ప్రసాద్, తన్నీరు శ్రీను, మలినేని గీతాంజలి, శివకుమారి, అడుసుమళ్ళీ రాధిక, సుల్తాన్ బి, చిట్టా తిరుమల, వీర బ్రహ్మయ్య జనసేన-బిజెపి మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.