ప్రకృతి విపత్తుతో అన్నదాతకు కన్నీళ్లు

  • నేలకొరిగిన అరటి, బత్తాయి, మామిడి, మొక్కజొన్న పంటలు.
  • రెండు మండలాల్లో కోట్లలో పంట నష్టం.
  • రైతన్నలను ఆదుకోవాలన్న కాశెట్టి సంజీవరాయుడు, కొండిశెట్టి ప్రవీణ్ కుమార్.

శింగనమల, ప్రకృతి విపత్తు ద్వారా నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు, శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం నార్పల, పుట్లూరు, మండలాల పరిధిలోని గ్రామాల్లో కురిసిన వడగండ్ల వర్షం వల్ల నష్టపోయిన వ్యవసాయ, పాడి రైతులను జనసేనపార్టీ నాయకులు ఆదివారం పరామర్శించారు. జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ప్రకృతి విలయతాండవం చేసిందని. కేవలం ఒక్క అరగంట కురిసిన వడగండ్ల వర్షానికే పూర్తీగా పంట నేల మట్టం అయిందని ముఖ్యంగా వెంకటాంపల్లి, మద్దలపల్లి, నాయనపల్లి, గడ్డంనాగేపల్లి, కురగానపల్లి, కర్ణపుడికి, మడుగుపల్లి, ఎల్లుట్ల గ్రామాల పరిధిలోని చేతికొచ్చిన పండ్ల తోటలు నేలకొరిగి పూర్తిగా దెబ్బ తిన్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని అన్నారు. శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి విపత్తు సంబవించడం బాధాకరమని. మాది రైతు ప్రభుత్వం అని జబ్బలు చరుచుకుంటూ ప్రగల్బాలు పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు ప్రభుత్వ పెద్దలు ఇంతటి విపత్తు సంభవించి వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు పూర్తిగా నేలమట్టం అయి నష్టపోయినప్పటికీ రైతులను కనీసం పరామర్శించి వారికి సహాయ, సహకారాలు అందించడంలో విఫలమయ్యారని అన్నారు. ఈ విపత్తు ద్వారా నష్టపోయిన వ్యవసాయ, పాడి రైతులను, ఆస్తి నష్టం కలిగిన వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకుని తమ చిత్తశుద్ధి చూపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుపాకుల భాస్కర్, విశ్వనాథ్ రెడ్డి, ఆకుల అశోక్, బాబా నజీర్, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.