భారీ వర్షాలతో జలమయమైన హైదరాబాద్ రోడ్లు

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనo కారణంగా హైదరాబాద్‌లో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో నగరంలోని ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్ల వద్ద వర్షపునీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.