మే 1 నుంచి తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్, పూర్తి షెడ్యూల్ విడుదల..
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల అయ్యింది. మే 1న తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానుండగా.. మే 2 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు మొదలవుతాయి. ఇంటర్ ఫస్టియర్ బోర్డ్ ఎగ్జామ్స్ మే 1 నుంచి 19 వరకు, ఇంటర్ సెకండియర్ పరీక్షలు మే 2 నుంచి 20 వరకు జరగనున్నాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం నాడు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల చేశారు.
ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఏప్రిల్ 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ చేశారు. వీటితో పాటు ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే సమయంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
మే 1 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మే 3 ఇంగ్లీష్ పేపర్-1
మే 5 మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ-1, సివిక్స్-1
మే 7 మ్యాథ్స్ పేపర్-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1
మే 10 ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్-1,
మే 12 కెమిస్ట్రీ, సోషియాలజీ, కామర్స్
తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్
మే 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
మే 4 ఇంగ్లీష్ పేపర్-2
మే 6 మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ-2, సివిక్స్-2
మే 8 మ్యాథ్స్ పేపర్-2బీ, జువాలజీ-2, హిస్టరీ-2
మే 11 ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్-2
మే 13 కెమిస్ట్రీ పేపర్-2, సోషియాలజీ-2, కామర్స్-2