రామగుండం జనసేన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రామగుండం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ మరియు రాష్ట్ర యువజన సెక్రటరీ మూల హరిష్ గౌడ్ సూచనలు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రామగుండం నియోజకవర్గం జనసేన నాయకులు రావుల సాయికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రావుల మధు జండా ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ఆర్గనైజర్ మంథని శ్రవణ్, ఎగ్జికూటివ్ మెంబెర్ మేకల రాజ్ కుమార్, రామగుండం నియోజకవర్గం నాయకులు ఎముర్ల రంజిత్, గోలి మహేందర్, మోతె రవికాంత్, బుస శ్రీనివాస్, బండారి తిరుపతి, సాయి పవన్, పొట్ల శశాంక్, పొట్ల సాయి తేజ, నడిగోటి సాయికుమార్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.