బి.కొత్తకోటలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు

బి.కొత్తకోట, జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ బండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 131వ జన్మదిన వేడుకలు నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానేతగా ఈరోజు బడుగు బలహీనవర్గాల అనుభవిస్తున్న ఈ రాజ్యాంగ హక్కులకు అంబేద్కర్ కారణమని వారు తెలియజేశారు ఇంకా పూర్తిస్థాయిలో బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగపరమైన హక్కులు పూర్తి స్థాయిలో చేరలేదని పూర్తి స్థాయిలో చేరేవరకు జనసేన పార్టీ అధికారంలోకి రాగానే రాజ్యాంగపరంగా వారికి కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలుపరచటం కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి.కొత్తకోట మండల అధ్యక్షులు సొట్ట రామానుజులు, ముని, వెంకీ, ఆది, కళ్యాణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.