గ్రామాలలో జనసేన బలోపేతమే లక్ష్యం: మనుబోలు శ్రీనివాసరావు

నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు..

తిరువూరు నియోజకవర్గం: ఏ కొండూరు మండలంలో గ్రామ గ్రామానికి జనసేన జెండా కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గం సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు.. మంగళవారం రాత్రి ఏ కొండూరు మండలం రేపూడి తండాలో మండల పార్టీ అధ్యక్షుడు లాకవతు విజయ్ అధ్యక్షతన జరిగిన జనసేన పార్టీ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ రానున్నది ఎన్నికల కాలమని పార్టీ ఆదేశాను సారం వీలైనంత త్వరగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన మండల అధ్యక్షులకు మరియు మండల కార్యవర్గ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. గ్రామ గ్రామాన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం బలంగా పనిచేసే యువతను గుర్తించి బూత్ కమిటీల్లోకి తీసుకోవాలని, బూత్ కమిటీలు ఏర్పడిన అనంతరం వారందరికీ పోల్ మేనేజ్మెంట్ గురించి నియోజకవర్గంలో కొన్ని రోజులు పాటు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు శ్రీనివాస రావు అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీతో ఉన్న ఎన్నికల పొత్తులు దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలని, ఉమ్మడిమేనిఫెస్టో వచ్చిన అనంతరం ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం పలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గ్రామాలలో ఓటు హక్కు లేని యువతను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని జనసేన నాయకులకు సూచించారు. రానున్నద ప్రజా ప్రభుత్వమని నియోజకవర్గంలో ఉన్న సమస్యలైన ఇక్కడి ప్రజలు, గిరిజనులు ఎదుర్కొంటున్న కిడ్నీ వ్యాధి సమస్య గురించి, కృష్ణా జలాల గురించి మరియు నియోజకవర్గంలో ఉన్న పలు ప్రజా సమస్యల గురించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన అన్నారు. జనసేన పార్టీ భావజాలానికి ఆకర్షితులై పవన్ కళ్యాణ్ కి తోడుగా ఉంటామని గ్రామంలోని యువత మరియు వృద్ధుల సైతం ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు మండల అధ్యక్షుడు పర్సా పుల్లారావు, విస్సన్నపేట మండల అధ్యక్షుడు షేక్ యాసిన్, మరియు ఏ కొండూరు మండల కార్యవర్గ సభ్యులు పసుపులేటి సతీష్, వెంపాటి యేసయ్య, లాకావతు ఏసు, భూక్యరవి, అశోక్ సాయి, బద్దు, స్వామి, వంశి, బాలకోటేసు, భూక్యా శివ, రాంబాబు, తూము సాయి, శ్రీహరి, తోట పూల హరీష్, షేక్ ఫైరోజ్, బండారి తరుణ్, తదితర జనసైనికులు మరియు గ్రామ యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.