పవన్ రాకతో దద్దరిల్లిన విశాఖ వైసిపి వెన్నులో వణుకు

గుడ్లూరు, జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనవాణి కార్యక్రమంలో భాగంగా 16 వ తారీకున విశాఖకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవాలని అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులను మరియు జిల్లా నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేయించడం దుర్మార్గం. అధికార పార్టీకి నాయకులకు పవన్ కళ్యాణ్ అనే ఒక భయం పట్టుకుంది. జనం సమస్యల కోసమే ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ఉద్దేశంతో విశాఖ గర్జన సభను ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడటం వ్యక్తిగత విమర్శలు చేయటం ప్రజలు చూస్తున్నారు. ఎమ్మెల్యేల, మంత్రుల నోటి దురుసుకు సమానంగా రాబోయే ఎన్నికల్లో విశాఖ ప్రజలు ఆంధ్రరాష్ట్ర ప్రజలు సరియైన గుణపాఠం చెప్తారని ఇకనైనా ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని లేని పక్షంలో ప్రభుత్వ పతనానికి ప్రజలు పూనుకొన్నారు. వ్యక్తిగత విమర్శలతో దుర్భాషలాడటం జనసైనికులను, జనసేన నాయకులను రెచ్చగొట్టే విధానం మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో వైసిపి పార్టీకి అపజయం తప్పదని గుడ్లూరు మండల జనసేన పార్టీ నాయకులు అన్నంగి చలపతి, కొలకలూరి ఆమోసు మరియు మూలగిరి శ్రీను తదితరులు హెచ్చరించారు.