వారాహి యాత్ర విజయవంతం.. ముఖ్యమంత్రి అసహనం

  • సమాధానం చెప్పలేనోడే సంసారాల జోలికి వస్తాడు

పెడన నియోజకవర్గం: రాష్ట్ర ప్రజలకు తెలియని నాలుగో పెళ్లి ఎవరిని చేసుకున్నారో ముఖ్యమంత్రి గారు చెప్పాలని పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు ప్రశ్నించారు. గురువారం ఎస్ వి బాబు విలేకరులతో మాట్లాడుతూ జరిగింది అమ్మఒడి పంపిణీ సభ సహనం కోల్పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడవాళ్లు, చిన్నపిల్లలు వింటున్నారని కనీస స్పృహ లేకుండా పవన్ కళ్యాణ్ గారు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని నిండు సభలో తన అక్కస్సును వెళ్లగక్కారు. వారాహి విజయ యాత్రను గోదావరి ప్రవాహముల వచ్చిన జనాలను చూసి మతి భ్రమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. తెలుగుని కూనీ చేయటంలో సిద్ధహస్తులైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారాహిని వరహాని పలకటం ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఆంధ్ర రాష్ట్ర పరిపాలన గాలి వదిలి, అభివృద్ధి గురించి ఆలోచించకుండా నిండు సభలో ఒక నాయకుడు వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం ముఖ్యమంత్రికి విజ్ఞత లేదు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తి దిగజారుడు మాటలు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. వారాహి విజయ యాత్రలో భాగంగా నిర్వహించిన అనేక సభల్లో వైసిపి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, వైసిపి నాయకులు చేస్తున్న దాస్టికాలను, దౌర్జన్యాలను, దోపిడీలను, అక్రమార్జనను పవన్ కళ్యాణ్ గారు బయట పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాగ్దాటికి తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి. వారాహి విజయ యాత్ర ఇలాగే కొనసాగితే తమ పుట్ట మునుగుతుందనే భయంతో ముఖ్యమంత్రి మాటలు తడబడుతూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం తాపత్రయపడుతూ అడ్డమైన హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి మాటలు తడబడుతున్నాయి. సి పి ఎస్ రద్దు చేయలేదు, మద్యపాన నిషేధం చేయలేకపోయారు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, ప్రత్యేక హోదా ఊసే లేదు, విశాఖ ఉక్కును కాపాడలేకపోయారు, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరాన్ని గాలికి వదిలేసారు, రాష్ట్రంలో ఆడవాళ్లకు భద్రత లేదు ఈ సమస్యలే కాకుండా అనేక ప్రజా సమస్యలను పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడాన్ని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి దిగజారుడు ఆరోపణ చేస్తున్నారు. మీరు బటన్ నొక్కిన అమ్మ ఒడి పథకానికి అనేక ఆంక్షలు పెడుతూ నిజమైన లబ్ధిదారులను కుంటి సాకులతో అనర్హులు చేస్తూ మీరు చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. పథకం ప్రారంభంలో 15 వేల రూపాయలుగా ఉండే అమ్మఒడి తరువాత 14,000 ఇప్పుడు 13000 ఎందుకు ఇస్తున్నారొ చెప్పే ధైర్యం మీకుందా?. ముఖ్యమంత్రి సభకి పెన్షన్ దారులను వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలను బలవంతంగా తరలించి సభలు పెట్టుకునే మీరెక్కడ? పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపుతో గోదావరి ప్రవాహంల, కడలి ఉప్పెనలవచ్చి పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని ఆధ్యాంతం ఆసక్తితో విని క్రమశిక్షణతో వెళ్లింది కేవలం ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారు సభలకు మాత్రమే ఉంది. 2024 తర్వాత హలో ఏపీ బాయ్ బాయ్ వైసిపి అన్న పవన్ కళ్యాణ్ గారి మాటలు అక్షర సత్యం కానుంది. చివరిగా ఓ మహాకవి అన్నట్లు సమాధానం చెప్పలేనోడే సంసారాల జోలికి వస్తాడని పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు తెలిపారు.