పామిడి పట్టణ ప్రజల నీటి కష్టాలను వెంటనే తీర్చాలి జనసేన డిమాండ్

గుంటకల్, గత 15 రోజులకు పైగా పామిడి పట్టణంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది ప్రభుత్వం దీనిపై ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవడం లేదు సత్యసాయి వాటర్ పామిడి నుంచి గుత్తి గుంటకల్ ప్యాపిలి ఇలా అన్ని పట్టణాలకు నీటిని సరఫరా చేస్తోంది గాని పామిడి పట్టణ ప్రజలకు మాత్రం ఎందుకు అందించలేకపోతోంది? అధికారులు దీనిపై స్పందించి కనీసం సత్యసాయి వాటర్ అయినా పామిడి పట్టణ ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని అందించాలి. వర్షాలు పడితే చాలు మోటార్లు పోయాయి అనే కారణంతో పామిడి పట్టణంలో నీటి సరఫరాను ఆపివేస్తున్నారు ఎందుకు వర్షాలు పడిన ప్రతిసారి మోటర్లు పోతున్నాయి అలా మోటర్లు కాలిపోకుండా తగిన చర్యలు ఎందుకు ప్రభుత్వాలు చేపట్టలేకపోతున్నాయి దయచేసి ప్రభుత్వం వారు ఇక నుంచి అయినా తాగునీటి సమస్య లేకుండా చూడాలని జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాము. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజలతో కలిసి తీవ్ర నిరసనలు తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాము. దయచేసి అధికారులు ప్రజల కష్టాలను ఇక్కట్లను నీటి ఎద్దడిని గ్రహించి సత్వరం పట్టణ ప్రజలకు నీటి సమస్యను తీర్చవలసిందిగా పంచాయతీ కార్యాలయంలో ఈఓ శశికళకి జనసేన పార్టీ తరఫున వినతి పత్రాన్ని అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాంపిడి మండల అధ్యక్షులు యం.ధనంజయ. జనసేన మండల ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, షేక్షావలి, జనసేన పార్టీ పామిడి మండల కార్యదర్శులు ఖాజావలి, లాలూ స్వామి, రోషన్ జమీర్, అబ్దుల్ సత్తార్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.