ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అడుక్కునే స్థితికి తీసుకొచ్చిన ఘనత వైసీపీది

* శవాలపై బొంగు పేలాలు ఏరుకొని తినే రాజకీయం వైసీపీ నాయకులది
* కష్టార్జితాన్ని ప్రజలకు పంచే గొప్ప గుణం పవన్ కళ్యాణ్ ది
* జనసేన పాలనలో రాయలసీమ వలసలు ఆపుతాం
* కర్నూలు జిల్లా కార్యకర్తల సమావేశంలో పీఏసీ సభ్యులు శ్రీకొణిదెల నాగబాబు

జాతికి అన్నం పెట్టిన అన్నపూర్ణగా పేరు గాంచిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల కోసం బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తూ అడుక్కునే స్థితికి తీసుకొచ్చిన ఘనత “వై.సీ.పీ.” ప్రభుత్వానికి దక్కుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు వెల్లడించారు. కర్నూలులో శనివారం జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో శ్రీ నాగబాబు గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శవాలపై బొంగు పేలాలు ఏరుకొని తినే రాజకీయం వై.సీ.పీ. నాయకులది అయితే, తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచే గొప్ప గుణం శ్రీ పవన్ కళ్యాణ్ గారిది అని అన్నారు. అప్పుల రాష్ట్రంగా పేరు బడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేసి పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలు జనసేన దగ్గర ఉన్నాయని ఉద్ఘాటించారు. రాయలసీమలో, ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో ఇటీవల వేల సంఖ్యలో ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు పోవడం చాలా బాధాకరమని, జనసేన అధికారంలోకి వచ్చాక వలస పోవాలనే ఆలోచన, అవసరం కూడా లేకుండా చేస్తామని అన్నారు. వందల సంఖ్యలో హాజరైన వీర మహిళలు, జన సైనికులు వై.సీ.పీ. ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యల గురించి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారి సమక్షంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ప్రతీ ఒక్కరి అభిప్రాయం, సమస్యలను విన్న అనంతరం శ్రీ నాగబాబు గారు స్పందిస్తూ కర్నూలులో జరిగిన సమావేశం వివరాలు అన్నీ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమన్వయంతో పని చేయాలని కోరారు.
* జనసేన ప్రభంజనం ఆపడం ఎవరి తరం కాదు: శ్రీ కందుల దుర్గేశ్, పీఏసీ సభ్యులు
ఏ విధమైన వ్యక్తిగత లాభాపేక్ష ఆశించకుండా కేవలం ప్రజా ప్రయోజనాల కోసం పని చేయడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెలకొల్పిన జనసేన పార్టీ ప్రభంజనం ఆపడం ఎవరి తరం కాదు. వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యత వీర మహిళలు, జన సైనికులు తీసుకోవాలి. సలహా దారుల దగ్గర నుంచి భూ కబ్జాల దాకా న్యాయస్థానాలతో మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వంగా వై.సీ.పీ. నిలిచిపోతుంది.
* మనకు రక్షణగా వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ ని మనం కాపాడుకోవాలి: శ్రీ చిలకం మధుసూధన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మనకు రక్షణగా వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనం కాపాడుకోవాలి. రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ అనే పదాన్ని ప్రచారం చేసుకుంటున్న సంప్రదాయ రాజకీయ పార్టీలను ఇంటికి పంపి, జనసేన అధికారంలోకి వచ్చాక రాయలసీమ అంటే ప్రేమ, అభిమానం, ఐకమత్యం అని చేసి చూపిస్తాం.
* జన సైనికులు, వీర మహిళల పోరాటానికి వైసీపీ దిగి రావాల్సిందే: శ్రీమతి యశస్వినీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జన సైనికులు, వీర మహిళల పోరాటానికి వై.సీ.పీ. తప్పనిసరిగా దిగి రావాల్సిందే. జన సైనికులు, వీర మహిళలు చేసే పోరాటానికి న్యాయపరంగా ఏవన్నా అడ్డంకులు ఏర్పడితే జనసేన లీగల్ సెల్ సహాయం ఉంటుంది. కార్యకర్తలు అంతా సమన్వయంతో పనిచేయాలి.
* ఏపీకి కాబోతున్న ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్: శ్రీ కూసంపూడి శ్రీనివాస్, అధికార ప్రతినిధి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కాబోతున్న ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని తెలిసి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే తమ మూలాలు కదిలి పోతాయనే అభద్రతా భావంతో వై.సీ.పీ. నాయకులు జనసేనపై, పవన్ కళ్యాణ్ గారిపై మాటల దాడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో జనసేన తప్ప వేరే మార్గం లేదు.
* వీర మహిళలమంతా సంఘటితంగా పోరాడుదాం: శ్రీమతి రాయపాటి అరుణ, అధికార ప్రతినిధి
వై.సీ.పీ. అరాచక పరిపాలనకు స్వస్తి చెప్పి, జనసేన పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యంగా వీర మహిళలమంతా సంఘటితంగా పోరాటం చేయాలి.
* క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన ఎప్పుడో గెలిచింది: శ్రీ టీ.సీ. వరుణ్, అనంతపురం జిల్లా అధ్యక్షులు
క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన ఎప్పుడో గెలిచింది. రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన గుర్తొస్తోంది. అడిగితే విననప్పుడు పోరాడి సాధించుకోక తప్పదు.
* ఓట్ల శాతం పెంపొందించడంపై దృష్టి పెట్టాలి: శ్రీ కళ్యాణ్ దిలీప్ సుంకర, స్థానిక నాయకులు
జన సైనికులు, వీర మహిళలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తూనే ఓట్ల శాతం పెంపొందించడంపై కూడా దృష్టి పెట్టాలి. విలాసవంతమైన జీవితాన్ని త్యజించి ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. పోలింగ్ కేంద్రాలే లక్ష్యంగా జన సైనికులు, వీర మహిళలు పని చేయాలి.
* ప్రజాధనం దోచుకోవడమే వైసీపీ లక్ష్యం: శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు
ప్రజలు నమ్మి అప్పజెప్పిన బాధ్యతను అడ్డం పెట్టుకొని ప్రజాధనం దోచుకోవడమే లక్ష్యంగా వై.సీ.పీ. పని చేస్తోంది. ప్రభుత్వ ఆదాయంలో ప్రతీ రోజు పది శాతం పాలకుల ఇంటికి తరలి వెళ్లిపోతోంది. ప్రజా సేవ కోసం కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. స్థానిక నాయకులు శ్రీ సురేష్, శ్రీ అర్షద్, శ్రీమతి రేఖ గౌడ్, శ్రీమతి హసీనా, పవన్ కుమార్, ఆయా నియోజకవర్గాల బాధ్యులు, జనసేన ప్రోగ్రామ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి యడవల్లి విశ్వనాథ్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు సమావేశం నిర్వహణలో ముఖ్య భూమిక పోషించారు. రవికుమార్, మల్లప్ప, వెంకప్ప తదితరులు పాల్గొన్నారు.