ప్రముఖ నటులు చలపతిరావు మృతి బాధాకరం

ప్రముఖ నటులు శ్రీ చలపతిరావు గారు కన్నుమూయడం బాధాకరమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలి నటనను చూపించారు చలపతిరావు గారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారు. చలపతిరావు గారి కుమారుడు నటుడు, దర్శకుడు శ్రీ రవిబాబు గారికి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేయడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.