ఉద్యోగుల వేతనాల్లో భారీ కోతలు విదించిన ఢిల్లీ మెట్రో కార్పొరేషన్

కరోనా వైరస్ కారణంగా మెట్రో సేవలు నిలిచిపోవడంతో ఆర్దిక ఇబ్బందులలో పడిన ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ఉద్యోగుల జీతభత్యాల్లో భారీ కోతలు విధిస్తూ ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించిన  ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆగస్టు నుంచి ఇచ్చే ప్రోత్సాహకాలు, భత్యాలలో 50 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొన్న సంస్థ.. వైద్య చికిత్స, టీఏ, డీఏ వంటి ఇతర సౌకర్యాలు మాత్రం వారికి అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

అయితే, మెట్రో ఉద్యోగులకు లభించే అన్ని రకాల అడ్వాన్సులను మాత్రం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిషేధిస్తున్నట్టు ఢిల్లీ మెట్రో వివరించింది. అయితే, ఇప్పటికే అడ్వాన్సులకు అనుమతి పొందిన వారికి మాత్రం వాటిని అందజేస్తారు.