మా స్థలంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాకే కేటాయించాలి

భైంసా: మా స్థలంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ లు ముందు మాకే ఇవ్వాలని భైంసా పట్టణం జనసేన ఆద్వర్యంలో ఆర్.డి.ఓ అఫీస్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ భైంసా పట్టణము, మహగాం రోడ్డు 118 సర్వే నంబర్ లో గల స్థలమును కిసాన్ గల్లి కి చెందిన కొంత మంది లబ్ది దారుల నుండి వారికి గతంలో కేటాయించిన స్థలం తీసుకొని అదే స్థలంలో డబుల్ బెడ్ రూమ్ లు కట్టిన తరువాత వారికి ఇస్తామని చెప్పి వారినుండి స్థలము తీసుకొని ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ప్రభుత్వం ఇప్పుడు సర్వే నిర్వహించి ఇస్తామని చెప్పడంతో లబ్ది దారులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి మా స్థలంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ లు ముందు మాకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.