మత్స్యకార అభ్యున్నతి యాత్ర నాల్గవ రోజు

తూర్పగోదావరి జిల్లా, మామిడికుదురు మండలంలో మత్స్యకార అభ్యున్నతి యాత్ర 4వ రోజు కార్యక్రమంలో భాగంగా మామిడికుదురు జనసేన శ్రేణులు జిల్లానాయకులు కందుల దుర్గేష్ మరియు రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ నియోజకవర్గాల ఇంచార్జులకు ఘనస్వాగతం పలికారు. మామిడికుదురు మండలంలో వి.ఆర్.ఏ ల నిరసన దీక్షలో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ నియోజకవర్గాల ఇంచార్జులు. మామిడికుదురు తాసిల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కనీస వేతనం 21000 వేతనం పెంచవలసిందిగా డిమాండ్ చేస్తూ అదే విధంగా పని చేస్తూ మరణించిన ఉద్యోగస్తులకు కారుణ్య నియామకం చేయవలసిందిగా కోరుచున్నాముని తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ కోరడం జరిగింది.

జనసేన పార్టీ మత్స్యకార యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, మామిడికుదురు మండలంలో పాశర్లపూడి బాడవ శ్రీరామ్ నగర్ ,బొమ్ముడి పాలెం మరియు పాశర్లపూడిలంక గ్రామాల్లో మత్స్యకార వీధుల్లో పర్యటించి వారి యొక్క సమస్యలను బాధలను, స్థితిగతులను ప్రభుత్వం వారిపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వర్రావు, స్థానిక మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాసరాజా, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, పంతం నానాజీ, కొత్తపేట ఇన్చార్జ్ బండారు శ్రీనివాసరావు, జగ్గంపేట ఇన్చార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర అమలాపురం ఇన్చార్జ్, శెట్టిబత్తుల రాజబాబు, అనపర్తి ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి గంటా స్వరూప, దిరిశాల బాలాజీ, మాజీ మేయర్ సరోజిని, జిల్లా కార్యదర్శులు వాసంశెట్టి కుమార్, మద్దాల చంటి, గుండాబత్తుల తాతాజీ, డీఎంఆర్ శేఖర్, సంగిశెట్టి అశోక్, గన్నవరం మండల అధ్యక్షుడు సాధనాల వెంకట సత్యన్నారాయణ, అంబాజీపేట మండల అధ్యక్షులు దొమ్మేటి సాయికృష్ణ, ఆర్డీఎస్ ప్రసాద్ డాక్టర్ మానస, సుంకర కృష్ణవేణి, కడలి ఈశ్వరి, మలికిపురం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణీ రాము తదితర జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.