గిరిజనులపై ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదు

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, జి.మాడుగుల మండలం, గెమ్మెలి పంచాయతీ కడగడ్డ గ్రామ గిరిజనుడు పండ్లి బాలన్న అనారోగ్యం కారణంగా బుధవారం ఉదయం స్వగ్రామం నుంచి పాడేరు జిల్లా ఏరియా ఆస్పత్రికికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. మృతదేహాన్ని పాడేరు హాస్పిటల్లో మార్చురీలో ఉంచారనే విషయం తెలుసుకున్న జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ పాడేరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేరుకొని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి సిబ్బందితో మాట్లాడి వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజకీయ కోణంలో చూసే అంశం కాదని కానీ గడిచిన నాలుగు సంవత్సరాలుగా గిరిజన ప్రజలు అనారోగ్యంతో ఉన్నప్పుడు డోలి మోతలు, ఏ వైద్యం అందకుండా మృతి చెందడం నిత్యకృత్యమయ్యింది. ఆస్పత్రిలో మృతి చెందిన తర్వాత పార్థివ దేహాన్ని తరలించేందుకు ఆంబులెన్స్ కొరత వల్ల ముంచంగిపుట్టు మండలంలో స్వయంగా డోలి కట్టుకుని మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించిన విషయం తెలిసిందే అయితే ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనులపై ప్రభుత్వానికి ఒకింత చిత్తశుద్దిలేని మాట వాస్తవమన్నారు జనసేనపార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్. వైకాపా ప్రభుత్వం గిరిజన ప్రజల అభివృద్ధికి కేవలం ఎన్నికలకి 4 నెలల ముందు మాత్రమే ప్రణాళిక చేస్తారని బహుశా వారి రాజకీయశైలి ఇదేనేమోనన్నారు. ఒకవైపు జగనన్న సురక్ష అంటూనే ఇంకో వైపు కనీస ఆంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండడం బాధాకరమన్నారు. మాకు అందిన సమాచారం మేరకు ఆస్పత్రిలో చేరుకుని గిరిజన సోదరుడు బాలన్న మృత దేహాన్ని వారి స్వగ్రామానికి చేరుకోవడానికి ఆంబులెన్స్ ఏర్పాట్లకు ఆస్పత్రి సిబ్బందితో సర్చించి ఏర్పాటు చేయడమైనది అయితే అమాయక గిరిజన సోధరులు ఇటువంటివి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సేవలు పొందేంత స్థితిలో లేరని అలాంటప్పుడు సంబంధిత ఆస్పత్రి సిబ్బంది ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మానవత్వంతో స్పందించాలన్నారు. ఇది రాజకీయాలకు సంబందించిన అంశం కాదని కానీ ఈ దుస్థితికి ఖచ్చితంగా గిరిజన ప్రజల తప్పిదం కూడా ఉందన్నారు. దయచేసి ఎవరికి కష్టమొచ్చినా గత వారం ముంచంగి పుట్టులో జరిగినట్టుగా మృతదేహాన్ని డోలిమోతతో గ్రామానికి చేర్చేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు విద్యావంతులైన గిరిజన యువకులు సాటి గిరిజన ప్రజలకు తోడ్పాటునిచ్చి తగు ఏర్పాట్లు చేసే విధంగా ఆలోచన చేయాలన్నారు.