అంబటి, రోజాలపై ధ్వజమెత్తిన జయరాం రెడ్డి

అనంతపురం, సున్నా సున్నా కలిసినా, హెచ్చించిన సున్నానే. “సున్నా” లెక్కచారాలు చెప్పడానికా? మీకు మంత్రి పదవి ఇచ్చింది. మీరు మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి మీ శాఖలో పురోగతి గురించి ఏనాడైనా రాష్ట్ర ప్రజలకు వివరించారా? వచ్చే ఎన్నికల తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు “సున్నా” అని తెలుసుకోవాలని, అమ్మా రోజా మీరు నారా భువనేశ్వరి లాంటి పెద్దల్ని చులకనగా హేయంగా, నీచంగా, ఫ్యాషన్ షో చేయడానికి వెళుతున్నారని మాట్లాడడం తగదు. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఆడవారిని మాట్లాడేది ఇలాగేనా? అంటూ గగ్గోలు పెడతారు. మీరు మాత్రం సాటి స్త్రీల గురించి కించపరుస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? మీరు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నగరి నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పగలరా? మీరు మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో పర్యాటక రంగం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పగలరా? అంబటి రాంబాబు, రోజా ఎవరు సున్నాలో రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికలలో తేల్చనున్నారు? ఇకనుంచి అయినా బాధ్యతగా మెలగండి? ప్రతిపక్షాల గురించి అవహేళనగా మాట్లాడి చరిత్ర హీనులు కాకండి అని అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాద్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.