పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం: రాజమండ్రి సెంట్రల్ జైలులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పరామర్శించి, రానున్న ఎన్నికల్లో జనసేన మరియు టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం అని ప్రకటించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా తెలిపారు. ఈ రాష్ట్రంలో వైసీపీ అరాచక, అవినీతి పాలన అంతమొందించాలంటే అన్ని పార్టీలు కలిసి పోటీ చేసి వ్యతిరేకత ఓటు చీలకుండా వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధఃపాతాళానికి వెల్లెట్టు చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహంతో కంగుతిన్న జగన్ రెడ్డి మరియు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారి పైన చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. ఎటువంటి స్వార్థం లేకుండా, రాజకీయాలు చూడకుండా కష్ట కాలంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, టీడీపీ క్షేత్ర స్థాయి కార్యకర్తలకు బరోసా ఇచ్చే విధంగా ఉధార మనస్తత్వంతో పవన్ కళ్యాణ్ గారు నిలవడాన్ని చూసి ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలను, నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్ళి ఆయన నాయకత్వం ప్రజలకి అందించేలా పనిచేస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో మొదటగా ఓడిపోయే వైసీపీ ఎమ్మెల్యే అవుతామనే భయంతో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిపై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని, నియోజకవర్గంలో ఉన్న కంపెనీలు, ఫ్యాక్టరీలు, వ్యాపారస్తుల దగ్గర ప్యాకేజీలు తీసుకోవడంలో ఎమ్మెల్యే ఎక్స్పర్ట్ అయ్యాడని వినుత మండిపడ్డారు. ఈయన పవన్ కళ్యాణ్ గారిపై ప్యాకేజ్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, అధికారంలో ఉన్నారు కాబట్టి దమ్ముంటే నిరూపించాలని మండిపడ్డారు. నియోజకవర్గంలో పెద్ద బందిపోటులా వ్యవరిస్తున్న ఎమ్మెల్యే కి ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు.