Vizag: అఖిలపక్షం ఏర్పాటు చేయకుంటే గ్రామ గ్రామానికి ఉద్యమ స్ఫూర్తి – వబ్బిన శ్రీకాంత్

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయవద్దని ఉక్కు పోరాట కమిటీకి మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అఖిలపక్షం వారం రోజులులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరగా, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రా లేనియెడల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు శ్రీ మజ్జి సత్యారావు, శ్రీ శ్రీ జు భీమాలి ఆధ్వర్యంలో 32 అమరవీరుల స్థూపాల వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ వబ్బిన జనార్దన శ్రీకాంత్ మాట్లాడుతూ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అందరం కలిసి పోరాటం చేద్దామని సదుద్దేశంతో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అఖిలపక్షం ఏర్పాటు చేయమని వారం రోజులు గడిచినా ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాలేదని, మీకు జనసేన పార్టీ మరియు జనసేనాని పవన్ కళ్యాణ్ పై కోపం ఉంటే వ్యక్తిగతంగా చూపించాలి కానీ విశాఖ ఉక్కు పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్న ఉద్యోగులు, విశాఖ అభివృద్ధిపై చూపించకూడదని ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరడంతో పాటు విశాఖ పోరాట కమిటీ కూడా అఖిలపక్షం ఏర్పాటు చేయలేని ఎడల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చేలాగా గ్రామ గ్రామానికి ఉద్యమ స్ఫూర్తి తీసుకొని వెళ్లాలని కోరడం జరిగింది.
గాజువాక జనసేన నాయకులు రిటైర్డ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీ సోమన్న మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఇది అమ్మడంగాని కొనడంగాని మేము ఒప్పుకోమని పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అందరూ సహకరించాలని కోరడం జరిగింది.
గాజువాక నాయకులు శ్రీ కాదా శీను మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందిందని అది దృష్టిలో పెట్టుకొని అఖిలపక్షాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.

పెందుర్తి నాయకులు కంచిపాటి మధు మాట్లాడుతూ సమస్య ఉన్నప్పుడు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మంచి సలహాలు ఇస్తూ ఉంటారు అని వాటిని ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పడం జరిగింది.

వీరమహిళ శ్రీమతి పార్వతి మాట్లాడుతూ నేనొక స్టీల్ ప్లాంట్ ఉద్యోగి బార్యనని ఇది ఒక రాజకీయ సమస్యగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమస్యగా భావించి అఖిలపక్షాన్ని వెంటనే ఏర్పాటు చేయమని కోరడం జరిగింది.

వీరమహిళ మీనాక్షి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ఆంధ్రప్రదేశ్ కి తలమానికంగా గల పరిశ్రమని అలాంటి పరిశ్రమ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ యొక్క విలువ తగ్గుతుందని దయచేసి ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం తగు చర్యలు చేయాలని కోరడం జరిగింది.

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీ మజ్జి సత్య రావు మాట్లాడుతూ ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా, చీమకుట్టినట్లు కూడా నటించడం, ప్రభుత్వ వ్యవస్థ తీరు మాకు చాలా ఆందోళన కలిగిస్తోందని రాబోయే రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ సూచనతో అమర వీరుల బలిదానాలు నుండి ఉద్యమస్ఫూర్తిని నింపుకొని ఉద్యమాన్ని మరింత బలంగా ప్రభుత్వాన్ని వినిపించుకునే లాగా పోరాటాలు చేస్తామని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో లక్కీ గోవింద్, బలిరెడ్డి ప్రసాద్ గోపి, సర్వసిద్ధి రాజు, కార్తీక్, వెంకట రమణ, జనసైనికులు, వీరమహిళలు మరియు ప్రజలు పాల్గొన్నారు.