దొంగలను పట్టుకోకపోతే ధర్నాకు దిగుతాం అంటున్న జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలంలో మండల కేంద్రానికి ఒక కిలోమీటర్ సమీపంలో ఉన్నటువంటి పెద్ద చెరువులో కొంతమంది దొంగలు పడి 10 లక్షలు విలువ చేసే పచ్చని చెట్లను నరికి అమ్ముకోవడం జరిగింది. జనసేన నాయకులు కలెక్టర్ ని మరియు ఇరిగేషన్ అధికారులను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేయకపోవడం వలన వెంటనే జనసేన నాయకులు ఎస్పిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే అధికారులు కేసు నమోదు చేశారు. ఆ పెద్ద చెరువులో పనిచేసినటువంటి మూడు జేసిబి ఓనర్లను పిలిచి విచారిస్తే వారిచేత పనిచేయించిన కాంట్రాక్టర్, ప్రభుత్వం నుండి ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా కాంట్రాక్టర్ కి కాంట్రాక్టు ఇచ్చిన అసలు చెరువు దొంగలు బయటకు వస్తారు. ప్రభుత్వపు ఆస్తిని దొంగలించి అమ్ముకుని సొమ్ము చేసుకున్న వ్యక్తులకు ఎటువంటి సెక్షన్లతో కూడిన కేసు నమోదు చేస్తారు ? 379 సెక్షన్ వర్తిస్తుందా లేదా ? నమోదు చేశారా లేదా ? జాప్యం ఎక్కడ జరుగుతుంది? లోపం ఎక్కడ ఉంది? ప్రభుత్వపు ఆస్తిని కాపాడవలసిన బాధ్యత ప్రజలకు మరియు అధికారులకు ఉంది. వెంటనే దొంగలను పట్టుకోవాలని నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనపర్తి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.