విజేతలకు బహుమతులు అందచేసిన జనసేన నాయకులు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, పొన్నమండ గ్రామంలో ఏర్పాటుచేసిన జనసేన ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో మొదటి బహుమతి స్పాన్సర్ మరియు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు 30,000/- రూపాయలని విజేతలకు అందచేశారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.