ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి: గుడివాడ జనసేన

గుడివాడ, ఉదయం 11 గంటలకు గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ… ఉపాధ్యాయులు ఎన్జీవోలు చేసిన సమ్మె కలెక్టరేట్ ముట్టడి ప్రభుత్వానికి ఒక చెంప పెట్టని విమర్శించారు. అలాగే ఉపాధ్యాయులు ఎన్జీవోల అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. వారు కోరుతున్నా న్యాయమైన కోర్కెలను తక్షణం ప్రభుత్వం అనుమతించాలని, ప్రభుత్వం చేసిన చీకటి జీవోలను వెంటనే రద్దు చేయాలని కోరారు. వారు కోరుతున్న పీఆర్సీని ఇవ్వాలని ఉద్యోగస్తులు కోరినట్లుగా సిపిఎస్ రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పి ఈరోజు మాట తప్పారు. కావున వెంటనే సిపిఎస్ రద్దు చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని… ఉద్యోగులుకు కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంది అని విమర్శించారు. ఉద్యోగస్తుల న్యాయమైన కోర్కెలు ప్రభుత్వాలు తీర్చకపోతే ఆ ప్రభుత్వాలు తారుమారయ్యాయి గమనించాలని అన్నారు. కావున ఉద్యోగస్తుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జనసేన పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గం తరఫున తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర్, జేమ్స్, షేక్ మీరా షరీఫ్, లోయ ప్రసాద్, సురేష్, మండల అధ్యక్షుడు ఇంటూరి గజేంద్ర, వేమూరి త్రినాథ్, గల్లా తిమోతి తదితరులు పాల్గొన్నారు.