ఘనంగా సీతానగరం జనసేన కార్యాలయ ఆవరణలో భోగి వేడుకలు

సీతానగరం జనసేన కార్యాలయ ఆవరణలో భోగి పండుగ వేడుకలు వైభవంగా జరిగినవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బత్తుల పాల్గొని.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, నాగబాబు గార్కి, కందుల దుర్గేష్ గారికి ఇతర జనసేన నాయకులకు, జనశ్రేణులకు, రాష్ట్రప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలో భాగంగా సాంప్రదాయబద్ధంగా పిడకలతో భోగిమంటలు వెలిగించి ఆనందోత్సవాలు జరుపుకున్న జనశ్రేణులు. మన సంస్కృతి, సంప్రదాయాలను, పండుగలను ప రిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న పార్టీ పెద్దలు. నేటి ఆధునిక సమాజంలో మన సంప్రదాయాలు, సంస్కృతిని, మన పండుగలను మరిచిపోతున్న.. ఈ నేటి తరుణంలో.. జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటైన “సంస్కృతులను పరిరక్షించే సమాజాన్ని” కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి లక్ష్మి అన్నారు.. అలానే తెలుగు పండుగలలో అతి పెద్ద పండుగైన భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని.. నాలుగు రోజులపాటు జరిగే ఈ పండుగలకు ఒక్కొక్క రోజు ఒకో విశిష్ఠత, అంతరార్థం ఉందన్నారు. పూర్తిస్థాయిలో గ్రామీణ వాతావరణాన్ని మరిపించేలా సంప్రదాయ పద్ధతుల్లో సందడిగా నిర్వహించిన ఈ భోగిమంటల్లో పిడకలు, అనేక రకాల చెట్ల దుంగలు వేసి, భోగిమంటలు వెలిగించి. అజ్ఞానం అనే చీకటి వీడి.. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని.. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపి. నేటి యువత ఈ పండుగలు, సంప్రదాయాలు, సంస్కృతులపై పూర్తి అవగాహన కలిగి ఉండి… భావితరాలకు ఈ సంస్కృతిని అందజేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి అన్నారు. కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమై.. పూర్తిస్థాయి హంగులతో, శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న సీతానగరం మండల జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి సీతానగరం మండల సీనియర్ నాయకులు, ఇతర జనసైనికులు పాల్గొన్నారు.