కొవిడ్‌-19 ‘చైనా వైరస్‌’ అన్నందుకు ట్రంప్‌పై దావా

కరోనా విపత్తుకు కారణం చైనా వైరస్, కుంగ్ ఫ్లూ వైరస్ అని అమెరికా అధ్యక్షునిగా ఉన్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కాగా… ఇప్పుడు ఆయన మాజీ కావడంతో ‘చైనీస్ అమెరికా మాజిక హక్కుల సంఘం’ తాజాగా కోర్టులో దావా వేసింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆసియా ప్రజలపై దాడులు జరుగుతున్నాయని సామాజిక హక్కుల సంఘం పేర్కొంది. ఈ క్రమంలో.. రూ. 166 కోట్ల పరిహారాన్ని కోరుతూ ట్రంప్‌పై దావా వేసింది. అయితే, ట్రంప్ సలహాదారులు దీనిని కొట్టిపారేస్తున్నారు.