ఇంటర్ పరీక్షలు.. తెలంగాణ సర్కార్ క్లారిటీ!

కరోనా ఎఫెక్ట్ తో తెలంగాణ ప్రభుత్వం టెన్త్ ఎగ్జామ్స్ ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేసిన సర్కార్ సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు ఆ సమయంలో ప్రకటించింది. అయితే.. కేంద్ర మంత్రులు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు.కరోనా కేసుల నమోదు తగ్గితే వచ్చే నెల అంటే జూన్ చివరలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. లేనిపక్షంలో ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించుకుంటామని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా క్లారిటీ ఇచ్చారు.

ఒకవేళ రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు లేకపోతే ప్రథమ సంవత్సరం పరీక్షల మార్కుల ఆధారంగా ఇచ్చేందుకు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇంటర్ బోర్డు గతంలోనూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గతంలో ఏప్రిల్ నెలలో పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం జూన్ 1 నాటికి పరిస్థితులు బట్టి పరిశీలిస్తామని అన్న సంగతి తెలిసిందే.