పాడేరులో ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమం విస్తృత స్థాయి సమావేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జనసేనపార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ మండల స్థాయి నాయకులతో పాడేరు అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య నా సేన కోసం నా వంతు కార్యక్రమం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు, గిరిజన ప్రజలను జనసేన పార్టీతో ప్రధాన భాగస్వామ్యం చేయాలని, పార్టీని బలోపేతం చేసేందుకు మనమంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జనసైనికులు తమదైన ప్రధాన బాధ్యతగా తీసుకుని, రాజకీయాలలో క్రౌడ్ ఫండింగ్ విధానం గొప్ప విప్లవాత్మక రాజకీయ దూరదృష్టి అని, దీని ప్రజల్లోకి విధానపరమైన ఆలోచనతో తీసుకెళ్ళాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జనసైనికుడు పైన ఉందని, పాడేరు అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.గంగులయ్య తెలిపారు. ఈ సమావేశంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, కొర్ర కమల్ హాసన్, చింతపల్లి మండల నాయకులు వంతల బుజ్జి బాబు, అరకు నియోజకవర్గం హుకుం పేట మండల నాయకులు బలిజ కోటేశ్వరరావు పడాల్ తదితర జనసైనికులు పాల్గొని నా సేనా కోసం నా వంతు కార్యక్రమం కోసం మేమంతా సంయుక్తంగా కలిసి పనిచేస్తామని తెలిపారు.