వెనుకబాటకు గురైన సమాజాన్ని రాజ్యాధికారం వైపు నడపడమే జనసేనాని లక్ష్యం: భైరపోగు సాంబశివుడు

రాజకీయంగా వెనుకబాటకు గురైన సమాజాన్ని చైతన్యపరిచి రాజ్యాధికారం వైపు నడపడమే పవన్ కళ్యాణ్ అంతిమ లక్ష్యం. ఆదిశగానే కొల్లాపూర్ నియోజకవర్గ బరిలో ఉండబోతుందని కొల్లాపూర్ నియోజక వర్గం జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ భైరపోగు సాంబశివుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజల సమస్యల పైన దృష్టి సారించి గడపగడపకి జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానాన్ని కొల్లాపూర్ నియోజక వర్గంలో ఉన్న ప్రతి గడపగడపకి తీసుకెళ్లే విధంగా జనసేన కార్యకర్తలు పని చేయాలని, ఆ దిశగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగాలని భైరపోగు సాంబశివుడు పిలుపునిచ్చారు. అలాగే జనసేన తరఫున ప్రజల పక్షాన పోరాడి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రతి ఒక్క అభిమాని, జనసైనికుడు ప్రతి గడపకి తిరగాలని ఆ దిశగా పనిచేస్తూ ముందుకు సాగే విధంగా కార్యక్రమం రూపొందించుకొని కొల్లాపూర్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగిరే విధంగా ముందుకెళ్లాలని, ఈ ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను, దాడులను వ్యతిరేకిస్తూ ప్రజలను ప్రభావితం చేస్తూ మహనీయులు మార్గాన్ని చూపుతూ అధికార దిశగా అడుగులు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ సందర్భంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అవసరమెంతైనా ఉంది అని, ప్రజలకి పార్టీని దగ్గర చేయడమే మన అంతిమ లక్ష్యంగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొల్లాపూర్ నియోజక వర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలమైన శక్తిగా బలమైన ప్రభావం చూపబోతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించింది కేవలం రాజకీయంగా వెనుకబాటుకు గురైన సమాజానికి ప్రజలను ఏకం చేస్తూ, రాజకీయాల వైపు రాజ్యాధికారం దిశగా నడిపించడం కోసమే ఆయన పార్టీని స్థాపించి ఆ దిశగా అహర్నిశలు కష్టపడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్నారు, అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీ గల నాయకుడు, అని అలాంటి నాయకుడు ఈ దేశానికి, ఈ రాష్ట్రాలకి ఎంతో అవసరమని, అలాంటి నాయకుడిని కాపాడుకొని అలాంటి పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ, యువకులకు ఒక స్థానిక పౌరులుగా, నియోజకవర్గ నాయకులుగా, కార్యకర్తలుగా, జనసైనికులుగా మన బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికలకు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండాలని
భైరపోగు సాంబశివుడు కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మండల నాయకులు తల్లారి మల్లేష్, బత్తిని బాలు, రాఘవేందర్, సుల్తాన్ గిరి ప్రసాద్, విజయ్ కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.