వెంకటేష్ కుటుంబాన్ని పార్టీ అన్నివిధాలా ఆదుకుంటుంది: శెట్టిబత్తుల రాజబాబు

అమలాపురం, ఒక మంచి జనసైనికుడిని కోల్పోయాం చాలా విషాదకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. వెంకటేష్ కుటుంబాన్ని పార్టీ అన్నివిధాలా ఆదుకుంటుంది. బాధాకరం ఏమిటంటే మృతుడు వెంకటేష్ అతని తండ్రికి క్రియాశీలక సభ్యత్వం చేయించాడు కానీ అతను చేయించుకోలేదు ఆ చిన్న తప్పిదం వల్ల పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కల్పించిన ప్రమాద భీమా భరోసా పథకం ఈ కుటుంబానికి అందే అవకాశం లేదు, కావున జనసైనికులు, నాయకులు అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూసి ప్రతీ ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడమే కాక మనతోటి జనసైనికులు క్రియాశీలక సభ్యత్వం తీసుకునేలా ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నామని జనసేనపార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు అన్నారు.