సమస్యలతో గిరిజన గ్రామ ప్రజల అవస్థలు

  • జనసేన పార్టీ అధ్యక్షులు సిహెచ్ మురళి ఆరోపణ

అరకు నియోజకవర్గం: అనంతగిరి మండలం ఏక దాటిగా వర్షాలు పడటంతో ప్రజలు అవస్థలుపడుతున్నారని అనంతగిరి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సిహెచ్ మురళి ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు రోడ్డు లేక చనిపోతున్నా పాటించుకునే నాయకులు లేరని, మండల కేంద్రంలో మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మండల జిల్లా పరిషత్ నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ప్రజలకు సమాధానం చెప్పాలి?.. చిన్న వర్షం వచ్చినా మండలం అంధకారానికి వెళ్ళిపోతుంది దీనికి పరిష్కారం లేదా, త్రాగునీరు లేక ప్రజలు వ్యాధిన పడుతున్నారు. ఇది గౌరవ ఎంపీపీ జడ్పిటిసిలకు తెలియడం లేదా?.. ఏపీ టూరిజం వారు పంచాయతీలకు ఇవ్వవలసిన నిధులు నిమిత్తం ఎందుకు ప్రశ్నించడం లేదు, మండలంలో నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఇస్తారమైన భూ దోపిడీ జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదు, మీరు గిరిజన పక్షాన ఉన్నారా?.. లేకపోతే దోపిడి నాయకులు పక్కన ఉన్నారా జనాలకు తెలియజేయండి. మండలంలో రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి అని జనసేన అధ్యక్షుడు సిహెచ్ మురళి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ నాయకులు నవీన్, ప్రవీణ్, మంగళ, శ్రీను, సుధాకర్, ఈశ్వరరావు, వీరమహిళ రత్నప్రియ, తదితరులు పాల్గొన్నారు.