Kurnool: నామపత్రాలు చించేసారని జనసేన నాయకులు ఆరోపణ

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జడ్పిటిసి స్థానాలకు సంబంధించి నామినేషన్ పత్రాలు సేకరణలో హైడ్రామా చోటు చేసుకుంది. జనసేనపార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన అభ్యర్థి నామపత్రాలు వైకాపా నాయకులు తీసుకెళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై శుక్రవారం సాయంత్రం జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి మార్కండేయ బాబు, మహిళా నాయకురాలు వివేక విలేకరులతో మాట్లాడారు. బేతంచెర్ల నగరపంచాయతీ నామినేషన్ ప్రక్రియ చూసుకుని తిరిగి వస్తుండగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నుంచి ఫోన్ వచ్చింది అన్నారు. కోవిడ్ తో మృతి చెందిన ఎర్రబోతుల వెంకటరెడ్డి కుమారుడు ప్రస్తుతం పోటీలో నిలిచారు. ఏకగ్రీవం చేసుకునేందుకు అందరూ సహకరించాలని కోరినట్లు తెలిపారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నిర్ణయం చెబుతాం అని చెప్పిన కొద్ది సమయానికే జడ్పీలో నామినేషన్ వేసేందుకు వచ్చిన బెలుంకు చెందిన జనసేన అభివృద్ధి పథకాలతో పాటు ప్రతిపాదించే వ్యక్తిని తీసుకున్నట్టు తెలిపారు. దీనిపై బనగానపల్లె ఎమ్మెల్యేకు ఫోన్ చేయగా తనకు తెలియకుండా జరిగిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని రేఖ ప్రశ్నించారు. నామినేషన్ కేంద్రం వద్ద రౌడీయిజం చేసి పత్రాలు చించి డమ్మీ అభ్యర్థి ఎత్తుకెళ్లారు అన్నారు. కొలిమిగుండ్ల జడ్పిటిసి స్థానం తొలుత ఎర్రబోతుల వెంకటరెడ్డికి ఏకగ్రీవం అయింది. జడ్పీ చైర్మన్ గా రేసులో ఉండటంతో ఈ స్థానం ఏకగ్రీవం చేసుకునేందుకు అప్పట్లో పెద్ద ఎత్తున పావులు కడిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు సైతం జనసేన అభ్యర్థిగా పోటీలోకి దిగిన నాగేంద్రపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి చివరిక్షణంలో ఉపసంహరించుకునేలా చేశారని మరోసారి జనసేన నాయకులు తెలిపారు.