కిమ్స్ లో చికిత్స పొందుతున్న పలువురిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ అమలాపురం కిమ్స్ లో చికిత్స పొందుతున్న పలువురిని బుధవారం పరామర్శించారు. ముందుగా ముమ్మిడివరం బైపాస్ రోడ్డులో యాక్సిడెంట్ లో ఇటీవల గాయపడి అమలాపురం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాట్టాడిపాలెం రామేశ్వరంతోట గ్రామానికి చెందిన గుత్తుల సత్తియ్య కుమారుడు సుబ్బారావును పితాని పరామర్శించిన అనంతరం కిమ్స్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న కాట్రేనికోన మండలం పల్లం గ్రామానికి చెందిన మల్లాడి వర్మ సోదరుడిని పితాని పరామర్శించారు. అనంతరం గ్యాస్ పెయిన్ తో కిమ్స్ లో చికిత్స పొందుతున్న ముమ్మిడివరం మండలం సి.హెచ్ గున్నేపల్లి గ్రామానికి చెందిన గుమ్మళ్ళ రామును పితాని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులగురించి అడిగి తెలుసుకున్నారు. వీరివెంట ముమ్మిడివరం మండల అధ్యక్షులు గోలకోటి వెంకటేశ్వర, గాలిదేవర బుల్లి, మేకల రెడ్డమ్మ, గోలకోటి రాజు, గాలిదేవర రాము మొదలగు వారు ఉన్నారు.