అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి

పుంగనూరు: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జనసేన, తెలుగుదేశం నాయకులు ఆదేశించారు. తెలుగుదేశం ఇంచార్జి చల్లా బాబు సూచనల మేరకు పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి సి.వి గంగాధర్ (చిన్నా రాయల్) డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చిన్నా రాయల్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీలు చేపట్టిన సమ్మెకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అంగన్వాడీలతో శాఖ పరమైన విధులు, ఎన్నికల పేరిట వెట్టిచాకిరి చేయిస్తున్న ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయక పోవడం దారుణమన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు, ఈఎస్ఐ, పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యూవిటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, తెలుగుదేశం నాయకులు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల రమణ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.