అంగన్వాడీ ఉద్యోగులపై రాష్ట్రప్రభుత్వం ఎస్మా చట్ట ప్రయోగం దారుణం

ప్రత్తిపాడు నియోజకవర్గం: తక్కువ గౌరవవేతనంతో ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామాలస్థాయిలో పని చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులపై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగిస్తామని ప్రభుత్వం తెలియజేయడం దారుణకరమైన విషయం. అంగన్వాడి ఉద్యోగులు రహదారులు, ఎటువంటి వసతులు లేని కుగ్రామాస్థాయిలో ఎటువంటి భద్రత లేని చోటా త్యాగగుణంతో పని చేస్తూ చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఎన్నోసేవలను అందిస్తూ… వారికి తగు పోషకాహారం ఇస్తూ, చిన్నపిల్లలకు ప్రాథమికస్థాయిలో విద్యాబుద్ధులు నేర్పుతూ.. కనీసవేతనం లేకుండా గౌరవ వేతనంతో విధులు నిర్వహిస్తూ మన బ్రతుకులు ఇంతేనా కనీసవేతనం ఇవ్వండి ,ప్రవేటు గృహాలలో అంగన్వవాడీ సెంటర్లు నడుపుతున్నా వాటికి ప్రభుత్వం అద్దె చెల్లించండి మహాప్రభూ అంటూ సుమారు 30 రోజుల నుండి శాంతియుతంగా నిరాహారదీక్షలు చేస్తూ, వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టిన చిరుఉద్యోగులైన అంగన్వడీ ఉద్యోగులుపై రాష్ట్ర ప్రభుత్వం ఎష్మా చట్టాన్ని ప్రయోగించి వారిని ఉద్యోగాల నుంచి తొలగించి, అవసరమైతే వాళ్లను అరెస్టు చేస్తామని హూకుం జారీచేయడం చాలా దారుణమైన విషయమని తెలియజేయుచున్నాను. అంగన్వడీ ఉద్యోగుల సక్రమమైన డిమాండ్లను రాష్ట్రప్రభుత్వం నెరవేర్చవలసింది పోయి, వారిపైనే ఎస్మాచట్టం ప్రయోగం దారుణం. అంగన్వాడీఉద్యోగులకు గౌరవవేతనం కాకుండా కనీసవేతనమైన ఇవ్వాలని వారు కోరుతున్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించమని కోరుతున్న తరుణంలో ఎస్మాచట్ట ప్రయోగం వారి పొట్ట మీద కొట్టడం అవుతుందని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,50,000 మంది అంగన్వాడి ఉద్యోగులపై సంక్రాంతి పండుగ ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా దిగ్భంధకరమైన విషయం.
కాబట్టి రాష్ట్రప్రభుత్వం మరొక్కసారి ఆలోచించి అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను నెరవేర్చుటకు తగు ప్రయత్నాలు చేయాలని ఇందుమూలంగా తెలియజేయుచున్నానని ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు మేకల కృష్ణ పేర్కొన్నారు.. శంఖవరం సమితిస్థాయిలో అంగన్వాడీ ఉద్యోగులకు జనసేన పార్టీ భరోసాగా ఉంటుందని యిందుమూలంగా గౌరవ పత్రికాప్రతినిదులకు తెలియజేయుచున్నానని కృష్ణ పేర్కొన్నారు.