జగన్ ధైర్యం ఉంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఎన్నికలకు రా!

  • ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గురువారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీ అధినేత ప్రభుత్వ సొమ్ముతో లక్షల మందిని ఏర్పాటు చేసి లబ్దిపొందాలని చూస్తున్నారు. వైసీపీ నేతలు వాలంటీర్స్ ని చిట్టచివరకు మదర్ థెరిసాల పేరుతో గొప్ప సంఘ సంస్కర్తలగా వర్ణించిన ఘనులు. బూత్ కమిటీల నిర్మాణం పేరుతో మంగళగిరిలో సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు. వాలంటీర్స్ తో టీడీపీ, జనసేన చెందిన ఓటర్లను ప్రలోభ పరచి ఓట్లతో లబ్దిపొందలని చూస్తున్న వైసీపీ అధినేత. బూత్ కోర్ కమిటీలో వాలంటీర్స్, గృహ సారథులు కూడా పెట్టడంపై నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సొమ్మును కోట్లాది రూపాయలు సొమ్మును వాలంటీర్స్ పెట్టి ఓట్ల లబ్దిపొందాలని చూడటానికేనా అని ప్రశ్నించారు. నిన్న మంగళగిరిలో వాలంటీర్స్ మీటింగ్ లో 19 విధివిధానాలు కలిగిన నిర్ణయ పత్రాన్ని వాలంటీర్స్ కి అందచేసారన్నది నిజం కాదా? జగన్మోహన్ రెడ్డికి ప్రజలపై నమ్మకం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. గతంలో జగన్మోహన్ రెడ్డి జన్మభూమి కమిటీలపై విరుచుకుపడి నేడు వాలంటర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి నిస్సిగ్గుగా వారిని ప్రభుత్వ సొమ్మును కట్టపెట్టి రాజకీయ లబ్దిపొందలని చేస్తున్నావా. వాలంటీర్స్ వ్యవస్థ పేరుతో వైసీపీ అధినేత ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎన్ని రకాల సైనిక శ్రేణులు ఏర్పాటు చేసుకున్నా ప్రజలు తగిన గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. జరగబోయే ఎన్నికల నేపధ్యంలో వైసీపీ కుట్రలను ఎదుర్కోవడానికి న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని గుర్తుచేసారు. వాలంటీర్ వ్యవస్థతో జగన్ రాజకీయ లబ్దిపొందలని చూస్తున్న దానిపై త్వరలోనే గవర్నర్ కలసి చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందిస్తామని అన్నారు. మంత్రి రజని గుంటూరు నగరంలో ఉన్న వాలంటీర్స్ అందరితో సమావేశం ఏర్పాటు చేసి25 వేల రూపాయలు నగదు పంపారంటూ చేసిన గాదె వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ యర్రంశెట్టి పద్మావతి, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా కార్యదర్శులు చట్టాల త్రినాథ్, సిరిగిరి శ్రీనివాస్, చింత శివ, గోపిశెట్టి సాయి, యర్రంశెట్టి సాయి, భాష తదితరులు..