తెలంగాణ ఉన్నత విద్యామండలికి వినతిపత్రం అందజేసిన జనసేన విద్యార్థి విభాగం

హైదరాబాద్, జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీలలో ప్రభుత్వ నియమ నిబంధనలతో మెరిట్ ప్రకారం భర్తీ చేయాల్సిన 30% మేనేజ్మెంట్ సీట్లని, ఆవిధంగా కాకుండా ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజ్ లు ఒక్కో సీటును 10 లక్షలకి 15 లక్షలకి డోనేషన్ల పేరుతో అమ్ముకుంటున్నాయి. 30% ఉండే ఈ సీట్లని రాష్ట్రవ్యాప్తంగా మరియు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఒక 30 ఇంజినీరింగ్ కాలేజ్ లు దాదాపు వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారంటే విద్యాసంస్థలని ఎంత స్థాయిలో వ్యాపార కేంద్రాలుగా మార్చారో మనం అర్ధం చేసుకోవచ్చు. కావున ఈ 30% ఉన్న మ్యానేజ్మెంట్ సీట్లని ఆఫీషల్ వెబ్ సైట్ ద్వారానే పూర్తి పారదర్శకంగా భర్తీ చేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో. లింబాద్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు దీనిపై సానుకూలంగా స్పందించి రెండు మూడు రోజులలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ఈ విషయంపై జాప్యం చేస్తూ ఇలాంటి వాటికి పాల్పడుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోని పక్షంలో జనసేన విద్యార్థి విభాగం తీవ్రస్థాయిలో పోరాడుతుందని తెలియజేయజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మిరియాల, గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం అధ్యక్షులు మహేష్ పెంటల, ప్రధాన కార్యదర్శులు తోరం సూర్య, దార ప్రణీత, ఉపాధ్యక్షులు వేణుగోపాల్, హైదరాబాద్ కమిటీ సభ్యులు మొర్రె దుర్గా, అమర్నాథ్, కృష్ణా బిరదర్, జనసైనికుడు ఆరని గౌతమ్ పాల్గొన్నారు.