వీరఘట్టం మండలంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల త్రిశూల వ్యూహం

  • అడుగడుగునా జననీరాజనాలతో జోరుగా సాగిన ప్రచార కార్యక్రమాలు

పాలకొండ నియోజకవర్గం: రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా శనివారం జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు ప్రజలకు చేరువచేస్తూ పాలకొండ నియోజకవర్గంలో వీరఘట్టం మండలం వివిధ గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా పరిపాలన తీసుకురావడానికి, మన ఆశలకు, ఆకాంక్షలకు వారధి పాలకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీలు బలపరచిన మన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి అని అభ్యర్దించిన జనసేన క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జిల్లా కార్యదర్శి బి.పి.నాయుడు, సయుక్త కార్యదర్శి జనసేన జాని, పుండరీకం మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం దారులకు ప్రస్తుత బిజెపి ప్రభుత్వం వేతనాలు సకాలం లో అందిస్తున్నారు. జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీలు ఎన్.డి.ఏ కూటమిగా ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్నయి. ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థులు అరకు పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీత కమలం గుర్తు, పాలకొండ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నిమ్మక జయకృష్ణ గాజుగ్లాస్ గుర్తు కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్లు కర్ణేన సాయి పవన్, వీరఘట్టం టౌన్ నాయకులు సరిపల్లి అచ్చుత రావు, నందివాడ పండు, ఉదయాన చరణ్, ముంజు సాయికుమార్, మాచర్ల చందు, రౌతు గోవింద రావు, దండెల సతీష్, దత్తి గోపాల్, దత్తి సంతోష్ వీరఘట్టం మండలం పరిధిలో వివిధ గ్రామంలోని ఉపాధి హామీ పథకం దారులను కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం – బిజెపి పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.