ఎన్డీఏ అభ్యర్థుల విజయం ఖాయం

  • రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకట రమణ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం మరియు టీడీపీ, జనసేన, బిజెపి శ్రేణులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం ఖాయం అని మలిశెట్టి వెంకట రమణ అన్నారు. జనసేన, టీడీపీ, బిజెపి పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో తమ గెలుపు ఖాయం అని, రాజంపేట సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని సుగవాసి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి రమణ, యద్దల సాగర్, రాజంపేట టిడిపి మండల అధ్యక్షులు గన్నేసుబ్బనర్సయ్య, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటల రామయ్య, జనసేన పార్టీ లీగల్ సేల్ కత్తి సుబ్బరాయుడు, భాస్కర్ పంతులు, లక్ష్మీనారాయణ, మనీ, జయరామయ్య, గోపి, చౌడయ్య, ఆచారి, గోపాల్, జనసేన వీరమహిళలు శిరీష, సుగుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.