వైజాగ్‌లో బ్యాంక్‌ జాబ్స్‌.. ది విశాఖ‌ప‌ట్నం కో-ఆప‌రేటివ్ బ్యాంకు లిమిటెడ్ నోటిఫికేషన్‌

విశాఖ‌ప‌ట్నంలోని మ‌ల్టీ స్టేట్ కో-ఆప‌రేటివ్ అర్బ‌న్ బ్యాంకు అయిన ది విశాఖ‌ప‌ట్నం కో-ఆప‌రేటివ్ బ్యాంకు లిమిటెడ్ (వీబీఐఎల్‌) 30 ప్రొబేషనరీ ఆఫీసర్‌ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://vcbl.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ముఖ్య సమాచారం:

మొత్తం ఖాళీలు: 30

అర్హ‌త‌: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణ‌త‌తో పాటు ఇంగ్లిష్‌, తెలుగు మాట్లాడ‌డం, చ‌ద‌వ‌డం, రాయ‌టంలో ప్రొఫిషియ‌న్సీ, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌ సైతం ఉండాలి.

వ‌య‌సు: 31.12.2020 నాటికి 20-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.900

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌/ ఎగ్జామినేష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప‌రీక్ష తేది: 2021 జ‌న‌వ‌రి నెల‌లో ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: నవంబర్‌ 10, 2020.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: నవంబర్‌ 30, 2020.

వెబ్‌సైట్‌:https://vcbl.in/