పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా వ్యవహరిస్తోంది..

రెండో విడత గ్రామ పంచాయతీ ఫలితాలలో జనసేన పార్టీ మద్దతుతో నిలిచిన అభ్యర్థులు సాధించిన విజయాలు చాలా సంతృప్తినిచ్చాయి. ముఖ్యంగా యువత, ఆడపడుచులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో జెండా ఎగరేసే విధంగా చేశారు. అధ్యక్షులవారి తరపున వారందరినీ అభినందిస్తున్నాను.

వైసీపీ ప్రభుత్వం చాలా దారుణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇన్ని ఒత్తిళ్లు, దాడులు చోటుచేసుకుంటున్న జనసేన శ్రేణులు ఏ దశలోనూ భయపడటం లేదు  పార్టీ బలోపేతం కోసం అన్ని ప్రాంతాల్లో మద్దతుదారులను పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలపడం గర్వించదగ్గ విషయం. పార్టీపరంగా మనం చేసే కార్యక్రమాలు, భావజాలం, సిద్ధాంతాలకు క్షేత్రస్థాయిలో చాలా మంది ఆకర్షితులవుతున్నారు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లుగా మహిళలు గెలుపొందడం, ముఖ్యంగా మైనార్టీ ఆడపడుచులు జయకేతనం ఎగరవేయడం అభినందనీయం. అదేవిధంగా యువకులు అనేకమంది యువతీయువకులు గెలుపొందారు. అందరికీ అభినందనలు.

ప్రజాస్వామ్యంలో మార్పు రావాలంటే మనందరం కలిసికట్టుగా పోరాడాలి. పంచాయతీ ఎన్నికలు అందరికి అద్భుతమైన అవకాశం.  మొదటి రెండు విడతల ఫలితాలు అనుకున్నదానికంటే చాలా బాగున్నాయి. మూడు, నాలుగు విడతల్లో కూడా ఇలానే కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆశిస్తున్నాను. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేయాలని కోరుకుంటున్నాను.