ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో గంజాయిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాదకద్రవ్యాల హబ్‌గా మారిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఏపీలోని గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతోందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. ”గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో 2018లో నా పోరాటయాత్రలో గంజాయిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆ సమయంలో పోరాటయాత్ర చేశాను. ఏవోబీలో గంజాయి మాఫియాపై.. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఫిర్యాదులొచ్చాయి” అని పవన్‌ అన్నారు. ఏపీలో గంజాయి మూలాలున్నాయంటూ హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను పవన్‌ ట్వీట్లకు జత చేశారు.