లబ్ది దారులు దరఖాస్తులు ఇవ్వాలా..? చావాలా..?

భైంసా: బీసీల లక్ష రూపాయల పథకానికి దరఖాస్తుల గడువు పెంచాలని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇస్తామన్న లక్ష రూపాయల లోన్ కోసం ఆదాయ, రాబడి ధృవీకరణ పత్రాల కోసం తాహాసిల్దార్ కార్యాలయం, మీసేవ సెంటర్ల చుట్టూ తిరిగి తిరిగి అనేక అవస్థలు పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవ్వరు పట్టించు కోవడం లేదు. ఇప్పుడున్న ఎండలకు లబ్ది దారులు అనారోగ్య పాలై చనిపోతే ఈ భాధ్యత ప్రభుత్వమే వహించాల్సి వస్తుంది. రాత్రుల్లో కూడా వచ్చి ఆఫీస్ ముందర కూర్చున్నా ఫలితం లేకుండా పోతుంది. అసలు లోపం ఎక్కడ జరుగుతుందో అర్థం కాక ప్రజలు అల్లలాడి పోతున్నారు. ఒక పక్క సమయం మించి పోతుంది. ప్రభుత్వం రేపే ఆఖరు తేదీ అని చెప్పే సరికి గుండెలు పగిలేలా కన్నీరు మున్నీరు చేసుకుంటూ వెళ్లి పోతున్నారు. బిసిలపై ఇంత చిన్న చూపు చూస్తు.. కనీసం అవగాహన కల్పించకుండా ఎమ్మెల్యే అధికారులకు పురమయించకుండ చోద్యం చూడటం ఎంత వరకు సమంజసం. ప్రజ సమస్యలపై పట్టించుకోకుండా వుంటే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి రోజు పనికి వెళ్ళలేక కూలి చేస్తే కాని పొట్ట గడవని పరిస్థితిలో వున్న నిరుపేదలకు మరింత ఘోరంగా దళారులు ఇదే అదునుగా భావించి లబ్ది దారుల నుండి వందలు వేల రూపాయలు దోచుకుంటున్నారు. కాబట్టి అధికారులు తహశీల్దార్ కార్యాలయంలో, మీ సేవ కేంద్రాల్లో నిఘా పెట్టీ దోపిడీని అరికట్టాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గడువు తేదీని పొడిగించాలని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు డిమాండ్ చేసారు.