చెక్కభజన చేయడంలో రోజాను మించిన వారు లేరు: ఎస్ వి బాబు

*విజయమ్మ ఎందుకు రాజీనామా చేసిందో చెప్పు రోజా

పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు మాట్లాడుతూ.. ముందు విజయమ్మ మీ పార్టీకి రాజీనామా ఎందుకు చేసిందో చెప్పు రోజా.. జబర్దస్త్ షోలో కామెడీ చేసే రోజా శుక్రవారం ప్లీనరీలో చేసిన ప్రసంగం చేతకాని వాడి వంటలా కొంచెం వెరైటీగా ఉంది. చెక్కభజన చేయడంలో రోజాను మించిన వారు లేరు అని నిరూపించుకుంది.

జగనన్న నామస్మరణతో అసలు తాను చెప్పాలనుకునే విషయం మర్చిపోయింది. విజయమ్మ గారి రాజీనామాను కప్పిపుచ్చుకోవడానికి సీరియస్ సినిమా మధ్య వచ్చే కామెడీ బిట్లగా ఉంది.

తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఉద్దరిస్తాడంటూ రోజా చేసిన వుకదంపుడు ప్రసంగం గాడిద మోసిన బూడిద బరువు లాగా ఉంది.

వైసిపి ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో మహిళల మీద అనేక అత్యాచారాలు జరిగాయి. దిశ లేని దిశా చట్టం ఎ ఆడబిడ్డ మాన మర్యాదలను కాపాడలేదు. దిశా చట్టం అసంపూర్ణ చట్టం. 22 మంది ఎంపీలు గెలిచామని గర్వంగా చెప్పుకుంటున్న రోజా దిశా చట్టాన్ని పార్లమెంట్లో ఎందుకు ఆమోదింప చేసుకోలేకపోయారో చెప్పగలవా?

మీ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నారు. మీ పార్టీ వచ్చి మూడు సంవత్సరాలయింది దశలవారీగా మద్యం అమ్మకాలను ఎలా పెంచాలో ఆలోచిస్తున్నారే తప్ప, మద్యపాన నిషేధాన్ని ఎందుకు గాలి వదిలేసారొ చెప్పగలవా రోజా?

సోనియాగాంధీని గడగడలాడించాడు అని చెప్పుకుంటున్న మీ అన్న కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ కి రావలసిన విభజన హామీలను ఎందుకు నెరవేర్చుకోలేక పోతున్నాడు?

22 మంది ఎంపీలను ఇస్తే ఆకాశాన్ని, భూమిని ఒకటి చేస్తానన్న మీ అన్న ఈరోజు ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు?

అవినీతికి ప్యాంటు చొక్కా ఇస్తే ఎలా ఉంటాడో తెలుసా రోజక్క, మీ అన్న జగనన్న ఉంటాడు.

పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు. నీతి, నిజాయితీకి నిలువెత్తు రూపం పవన్ కళ్యాణ్. తన కష్టార్జితాన్ని 30 కోట్ల రూపాయలను కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేసిన మానవతా మూర్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారితో మీరు పోల్చుకోవాలంటే వంద జన్మలు ఎత్తాలి.

మీరు రాజకీయాన్ని వ్యాపారం చేశారు. మీరు పంచభూతాలను దోచుకుంటున్న దోపిడీ దొంగలు.

విలాసవంతమైన తన జీవితాన్ని ప్రాణంగా పెట్టి నీతివంతమైన రాజకీయాలను చేయాలని పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సమయం పట్టొచ్చు. ఆలస్యం కావచ్చు. సాంప్రదాయ, వారసత్వ రాజకీయాలకు భిన్నంగా మార్పు కోసం ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయం సిద్ధించిన రోజున. ఇలాంటి రోజాలు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందేనని ఎస్ వి బాబు అన్నారు.